8, మే 2016, ఆదివారం

వ్రతములు


Telugu lo Bhakti - Vrathamulu
               సత్యనారాయణ వ్రతము చాలా శక్తిమంతము మరియు ఈ వ్రతమాచరించిన చాలా మంచిది. మంచి శుభములు కలుగును. తూర్పుగోదావరి జిల్లా, అన్నవరం లో సత్యనారాయణ స్వామి వారు స్వయంభువు గా వెలిశారు. ఈ వ్రతమును ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవ్వరైన ఆచరించవచ్చును. అన్నవరం దేవస్తానము లో నిత్యము సత్యనారాయణ స్వామి వారి వ్రతములు వేలాది మండి భక్తులు జరిపించుకొందురు. ఈ వ్రత విధానము కొరకు పై హెడ్డింగ్ మీద క్లిక్ చేయండి.

               వినాయక వ్రతము (వినాయక చవితి) ను బాధ్రపద శుద్ద చవితి నాడు కుటుంబమంతా కలసి చేసుకుందురు. పిల్లలకు ఈ వ్రతము అనిన చాలా ఆనందము. పత్రి, పూలు తెచ్చుకొనుటకు చాలా ఆనందముగా వెళ్తారు. ఈ వ్రత విధానము కొరకు పై హెడ్డింగ్ మీద క్లిక్ చేయండి.


               శ్రావణ శుక్రవార వ్రతము శ్రావణ మాసములో వస్తుంది. దీనిని పెళ్లి అయిన స్రీలు అందరూ ఆచరిస్తారు. ఈ వ్రత విధానము కొరకు పై హెడ్డింగ్ మీద క్లిక్ చేయండి

                శ్రావణ మంగళ వ్రతమును పెళ్లి అయిన స్రీలు శ్రావణ మాసములో వచ్చే ప్రతి మంగళ వారము నాడు వారి వారి ఆచారాల ప్రకారము ఆచరిస్తారు. ఈ వ్రత విధానము కొరకు పై హెడ్డింగ్ మీద క్లిక్ చేయండి. 

             సంతోషి మాత వ్రతము ఆచరించిన చాలా మంచిది. ఈ వ్రతమును చాలా నియమ, నిష్టలతో చేయవలని ఉంటుంది. ఈ వ్రతమును సంపూర్ణమైన భక్తి శ్రద్ధలతో చేసిన వారికి మంచి ఫలితములు కలుగును.. ఈ వ్రత విధానము కొరకు పై హెడ్డింగ్ మీద క్లిక్ చేయండి.

              వైభవ వ్రతము ఆచరించిన వైభవము, శాంతి, సౌభాగ్యములు కలుగును. ఈ వ్రతమును చాలా నియమ, నిష్టలతో చేయవలని ఉంటుంది. ఈ వ్రతమును సంపూర్ణమైన భక్తి శ్రద్ధలతో చేసిన వారికి మంచి ఫలితములు కలుగును.. ఈ వ్రత విధానము కొరకు పై హెడ్డింగ్ మీద క్లిక్ చేయండి.



               కేదారేశ్వర వ్రతము చాలా శక్తిమంతము మరియు ఈ వ్రతమాచరించిన చాలా మంచిది, శుభములు కలుగును. కేదారేశ్వర వ్రతం కార్తీక పౌర్ణమి రోజున నోచుకుంటే సిరిసంపదలకు, అన్నవస్త్రాలకు లోటుండదని పురోహితులు చెబుతున్నారు. మర్రిపండ్లను బూరెలుగా, మర్రి ఆకులను విస్తర్లుగా పెట్టి పూజలు . చేయటం పురాతనకాలం నుంచి సంప్రదాయంగా వచ్చుచున్నది.. ఈ వ్రత విధానము కొరకు పై హెడ్డింగ్ మీద క్లిక్ చేయండి.



               శ్రీ అనంతపద్మనాభ వ్రతము చాలా శక్తిమంతము మరియు ఈ వ్రతమాచరించిన చాలా మంచిది, శుభములు కలుగును. అనంతపద్మనాభ భాద్రపద శుక్ల చతుర్దశి రోజున నోచుకుంటే సిరిసంపదలకు, అన్నవస్త్రాలకు లోటుండదని పురోహితులు చెబుతున్నారు.  ఈ వ్రత విధానము కొరకు పై హెడ్డింగ్ మీద క్లిక్ చేయండి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి